30-10-2025 12:27:57 AM
అద్దె భవనం యాజమాన్యంతో ఆది నుండి ఇబ్బందులే
గండీడ్, అక్టోబర్ 29: ఆ కస్తూర్బా పాఠశాల ఆరంభం నుంచి సమస్యలకు కేరాఫ్ గా నిలుస్తూ వస్తుంది. అదే గండిడు మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ పాఠశాల. విద్యార్థినిలకు నిలయంగా మారిన కస్తూర్బా గాం ధీ పాఠశాలలో సమస్యలు తీష్ట వేసి కూర్చున్నాయి. జిల్లా ఉన్నత అధికారులు పరిశీలిం చి సంబంధిత అధికారులను ఆదేశించినప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించడంలో అధి కారులు విఫలం అవుతూనే వస్తున్నారు.
వి ద్యార్థినిలు వారి తల్లిదండ్రులు నెలకొన్న స మస్యలు కాస్తున పరిష్కరించాలని వేడుకుంటున్నప్పటికీ కారణాలు తెలియదు కానీ పరిష్కారం మాత్రం నోచుకోవడం లేదు. చదువుల కు నిలయంగా మారవలసిన క స్తూర్బా గాంధీ పాఠశాల రోగాలకు నిలయం గా మారే దుస్థితి ఏర్పడిందంటే అక్కడ ఎ లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రతినెల ఈ అద్దె భవనంకు దాదాపుగా 52000 అద్దె చెల్లిస్తున్నప్పటికీ ఆశించిన మేరకు సౌకర్యాలు మాత్రం ఆమ డ దూరంగా ఉంటూనే వస్తున్నాయి-
ఆసుపత్రిలో విద్యార్థినీలను పలకరించి పరిశీలించిన కలెక్టర్
ఏడాది జులై మాసంలో అధిక వర్షాల కారణంగా దోమల కాటు వల్ల అక్కడ చదువుకునే విద్యార్థినిలు చాలామంది వైరల్ జ్వరాల బారిన పడ విద్యార్థినిలను గండీడ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ను వైద్య సదుపాయాల నిమిత్తం చేరారు. జిల్లా కలెక్టర్ ఆక స్మిక వైద్య కేంద్రము తనిఖీ చేసినప్పుడు, అందులో కే.జీ.బీ.వీ. విద్యార్థినిలు కనబడితే వారిని కలెక్టర్, మీది ఏ స్కూలు అని వివరాలు అడిగితే వారు కే.జీ.బీ.వీ.లో చదువు తున్నామని సమాధానం చెప్పారు. అప్పుడే జిల్లా కలెక్టర్ హుటాహుటిన కేజీబీవీ సందర్శించి, వ్యాధికి కారణమైన అంశాలలో అక్క డ ఒక చిన్న నీటి కుంట ను తలపించే మురికి నీరు,ఆ నీటిపై వాలిన దోమలను గమనించి అక్కడే ఉన్న ఇన్చార్జ్ ఎం.పీ.డీ.వో. హరిశ్చంద్రారెడ్డి,ఏ.పీ.వో హరిశ్చంద్రుడు కు ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద, ‘ కమ్యూనిటీ సోకేజ్ పిట్స్‘ ఏర్పాటు చేసి నీటిని భూమి లోకి ఇంకే టట్లు చేయమని ఆదేశించారు.
తరచూ మండల స్పెషల్ ఆఫీసర్, ఎం.పీ.డీ.వో., ఎం.ఈ.ఓ. లు విద్యార్థినులకు అందించే భోజనాలను అక్కడ పరిశీలించడానికి వెళ్ళినారు. కానీ జిల్లా కలెక్టర్ పాఠశాల ప్రాంగణం పరిశుభ్రత కు చేసిన సూచనల ను బేఖాతర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్ చెప్పినట్లు ఎం.పీ.డీ.వో. గాని, ఏ.పీ.వో. గాని సోకేజ్ పిట్స్ ( ఇంకుడు గుంతలు) ఏర్పాటు చేయలేదు. వర్షాకాలం ప్రారంభం నుండి అక్కడ వర్షపు నీరు, విద్యార్థినిలు బట్టలు ఉతికిన నీళ్లు ఒక దగ్గర చేరడం వల్ల విద్యార్థినులు తరచు దోమల కాటుకు గురికావడం, అనారోగ్యానికి కార ణం కావడం షరా మామూలు అయిపోయింది. మండల అధికారుల నిర్లక్ష్యం కార ణంగానే కే.జీ.బీ.వీ. పాఠశాల ప్రాంగణంలో చిన్నపాటి కుంటను తలపించే నీరు నిలిచి, విద్యార్థిని లు నా నా ఇబ్బందులకు గురి అ వుతున్నారు.
ఆట స్థలంలో నీరు నిలిచి ఆటలాడే అవకాశం లేకుండా పోయింది. నీరు నిలవడం వల్ల నీటి పాములు, కప్పలు వి ద్యార్థిని ల నివాస గదులలోకి దూరుతున్నాయని విద్యార్థినిలు మరియు అక్కడున్న సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. అ ద్దెకు తీసుకున్న సిమెంటు రేకుల అన్ని గదు లు కూడా అక్కడక్కడ రేకులు చీలికలు ఏర్ప డి వర్షపు నీరు గదులలో చేరుతుందని, యాజమాన్యం వాటి రిపేర్ కు కూడా నోచుకోవడం లేదని, పాఠశాల ప్రాంగణంలో మ ట్టిని తోలి నీటిని నిలవకుండా చేయాలని ఎ న్నిసార్లు అద్దె భవన యాజమాన్యానికి చె ప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అద్దె భవన యా జమాన్యంతో మండల మరియు జిల్లా స్థా యి అధికారులు మాట్లాడి మా పాఠశాలలో ని నీటిని ఒక మోటార్ పంపు సహాయంతో నీటిని బయటికి తోడించండి మహాప్రభో అంటూ పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థినిలు బోరున విలపిస్తున్నారు.
అద్దె భవన యాజమాన్యంతో పాఠశాలలో ఏర్పడిన ఇబ్బందులను ఎస్. ఓ ను అక్టోబర్ 26 నాడు గండీడ్ కే.జీ.బీ.వీ. ని సందర్శించిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అడిగి తెలుసుకొని, ఇంతకుముందే జిల్లా కలెక్టర్ చేసిన సూచనలను బేఖాతర్ చేసిన మండల అధికారులను బాధ్యులను చేయకుండా, కేవలం కే.జీ.బీ.వీ. పాఠశాల ఎస్.ఓ. కు సోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా విద్యాధికారిని, జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించడం గమనార్హం.