12 April, 2026 | 12:35 PM

ఎన్ని కుట్రలు చేసినా నా గెలుపు ఖాయం

01-05-2024 12:53 AM

మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి 

మేడ్చల్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): ఎవరెన్ని కుట్రలు చేసినా మల్కాజిగిరిలో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మేడ్చల్ ప్రాంత సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, ఇన్‌చార్జి తోటకూర వజ్రేశ్‌యాదవ్, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్, రాఘవేందర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కౌన్సిలర్లు భవాని, చాపరాజు, మణికంఠ, దేవ, సముద్రాల సాయి పాల్గొన్నారు.