15 April, 2026 | 3:04 AM

ఫ్రీడమ్‌తో ఇంటింటా నెం.1 వంట

15-04-2026 12:21 AM
  1. సిద్దు జొన్నలగడ్డ నటించిన టీవీ ప్రకటన విడుదల

ఆవిష్కరించిన రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్

హైదరాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): భారతదేశంలోని ప్రముఖ వంట నూనె బ్రాండ్‌లలో ఒకటైన ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ప్రముఖ నటుఉ సిద్దు జొన్న లగడ్డ నటించిన తమ కొత్త టీవీ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు కుటుంబాల వంట గదులలోని ఉత్సాహభరితమైన వా తావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

క్కడ వంట చేయడం అనేది కేవలం ఒక దినచర్య మాత్రమే కాదు, కుటుంబం, రుచి, ఐక్యతకు ఒక వేడుక. సందడిగా ఉండే ఒక కుటుంబ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ ప్రకటనలో, సిద్దు జొన్నలగడ్డ తన కుటుంబంతో కలిసి వంటగదిలో పూర్తిగా నిమగ్నమై, ఆ అనుభూతిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా కనిపిస్తారు. అనేక రకాల వంటకాలు తయారవుతుండగా, అతను వండుతూ, రుచి చూ స్తూ, అలవోకగా ఒక సరదా పాట పాడు తూ, తనదైన శక్తిని, ఆకర్షణను ఆ ప్రాంగణానికి తీసుకువస్తారు. ఆ వంటగది నవ్వులు, సంభాషణలు పంచుకున్న ఆనందానికి కేంద్రంగా మారుతుంది.

ఇది ఒక సాధారణ తెలుగు ఇంటి స్ఫూర్తిని ఇస్తుంది. ఉత్సాహభరితమైన సంగీతం, ఆకట్టుకునే జింగిల్, హృద్యమైన దృశ్యాలు ప్రజలను లీనం చేయడంతో పాటుగా, ఇంట్లో వండిన రుచికర మైన వంటకాల పాత జ్ఞాపకాలను అనుభూతి చెందేలా చేస్తాయి. ‘ఫ్రీడమ్‌తో ఇం టింటా, నెం.1 వంట’ అనే ఆకట్టుకునే, సలభంగా అర్ధమయ్యే నినాదంతో రూపొందిం చబడిన ఈ ప్రచారం.

ఈ ప్రాంతంలోని కుటుంబాలతో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు ఉన్న బలమైన అనుబంధాన్ని నొక్కి చెబుతుంది. ప్రతిరోజు వంటను ప్రత్యేకంగా మార్చే, అర్థవంతమైన క్షణాల ద్వారా కుటుంబాలను దగ్గర చేసే ఈ బ్రాండ్, ఎలా ఒక నమ్మకమైన ఎంపికగా నిలుస్తుందో ఇది వెల్లడిస్తుంది.