నేరంపై పశ్చాత్తాపమే లేదు
- కోల్‌కతా రేప్ నిందితుడికి పాలీగ్రాఫ్ టెస్ట్
- అత్యంత క్రూర మనస్కుడిగా గుర్తింపు
కోల్‌కతా, ఆగస్టు 23: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ దవాఖానలో ట్రెయినీ వైద్యురాలిపై లైంగికదాడి చేసి దారుణంగా హత్యచేసిన నిందితుడు సంజయ్‌రాయ్ అత్యంత క్రూర స్వభావం కలవాడని సీబీఐ తెలిపింది. కోర్టు అనుమతితో అతడికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అందులో అతడు తన నేరంపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తంచేయలేదని అధికారులు తెలిపారు. మరోవైపు అతడు ఈ నేరం అనుకోకుండా చేసింది కాదని, ముందస్తు ప్రణాళికతోనే చేశాడని పేర్కొన్నారు. ‘పాలీగ్రాఫ్ పరీక్షలో అతడు చేసిన నేరం గురించి ఆసాంతం పూసగుచ్చినట్టు చెప్పాడు. అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు’ అని సీబీఐ అధికారులు వెల్లడించారు.
ముందురోజే రెక్కీ
సంజయ్‌రాయ్ ఆర్జీ కర్ దవాఖానకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. ఈ నెల 8న కూడా వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న మృతిరాలు, ఆమె స్నేహితుల చుట్టూ కొద్దిసేపు తిరిగాడు. ఈ వివరాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన అతడు.. మరుసటి రోజు అంటే ఆగస్టు 9వ తేదీన రాత్రి మళ్లీ వచ్చాడు. జీన్స్, టీ షర్ట్ వేసుకొని చేతిలో హెల్మెట్ పట్టుకొని కనిపించాడు. అతడి మెడలో బ్లూటూత్ పరికరం ఉన్నది. హత్య జరిగిన స్థలంలో అది పోలీసులకు ఆగస్టు 10న లభించింది. కేసు విచారణలో ఆ వస్తువే కీలకం కానున్నది.
అశ్లీల చిత్రాలకు అడిక్ట్
నిందితుడు అశ్లీల వీడియోలు చూడటానికి బానిసయ్యాడని, అతడిలో పశు ప్రవృత్తి అమితంగా ఉన్నదని సీబీఐ అధికారులు తెలిపారు. 8వ తేదీన దవాఖానలో ఛాతీ విభాగం వద్ద ఉన్న మృతురాలి వద్దకు ఉదయం 11 గంటలకు వచ్చి తచ్చాడిన అతడు.. అదే రోజు రాత్రి ఉత్తర కోల్‌కతాలోని వేశ్యా గృహాలకు వెళ్లాడని గుర్తించారు. అటు నుంచి అతడు నేరుగా దవాఖానకు వెళ్లి 9వ తేదీ తెల్లవారు ఝామున 4 గంటలకు లోపలికి ప్రవేశించినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది.
తలుపు గడియ లేకున్నా...
వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యచేసిన దవాఖానలోని సెమినార్ హాల్ ప్రధాన ద్వారం తలుపునకు గడియ బోల్టు విరిగిపోయి ఉన్నదని సీబీఐ అధికారులు గుర్తించారు. అంటే నేరం జరిగినప్పుడు తలుపు గడియ పెట్టలేదు. మరి బాధితురాలి అరుపులు బయట ఉన్న ఎవరికీ వినిపించలేదా? లేదంటే అటువైపు ఎవరూ రాకుండా ఎవరైనా కాపలా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
ఘోష్‌కు మమత బర్త్‌డే విషెస్
ఈ కేసులో కీలకంగా మారిన ఆర్జీ కర్ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు బెం గాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సన్నిహి త సంబంధాలున్నాయన్న ఆధారాలు బయట పడటం సంచలనంగా మారింది. గతంలో ఘోష్ జన్మదినం సందర్భంగా మమత ఆయన కు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యక్తిగతంగా రాసి న లేఖ మీడియాకు దొరికింది. 2022 జూన్ 30వ తేదీన మమత ఆ లేఖ రాశారు. ప్రభుత్వ అధికారులు, టీఎంసీలోని కీలక నేతల్లో కొంద రు మాత్రమే మమతకు వ్యక్తిగత లేఖలు రాసేం త సన్నిహితులుగా ఉన్నారని తెలిసింది. అందు లో ఘోష్ ఉండటం ఇప్పుడు వివాదాన్ని మ రింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఘోష్ ను మమత కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనేందుకు ఇంతకన్నా ఆధారం ఏం కావాలని బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ విమర్శించారు.






