22 April, 2026 | 9:47 PM

విద్యార్థినులపై టీచర్ లైంగిక వేధింపులు

24-08-2024 12:00 AM

తమిళనాడులోని ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘాతుకం

9మంది బాలికలపై నెలల తరబడి లైంగిక దాడి

నిందితుడు సహా ఐదుగురి అరెస్టు

కోయంబత్తూర్ (తమిళనాడు): ఓ  పక్క కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనపై  ప్రజలు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటే.. మరోపక్క బాలికలు, మహిళలపై దాడులు, హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడు రా్రష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లాలలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు.. 9మంది విద్యార్థినులపై నెలల తరబడి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కోయంబత్తూర్‌లోని సిరుముగై ప్రాంతంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) ‘బాలలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాల నివారణ’ అనే అంశంపై ఇటీవల నిర్వహించిన అవగాహన సదస్సులో బాధిత బాలికలు ఫిర్యాదు చేయడంతో   ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘పాఠశాలకు చెందిన నటరాజన్ అనే ఉపాధ్యాడు తమపై నెలల తరబడి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు’ అని 7, 8వ తరగతి విద్యార్థినులు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయమై తమ క్లాస్ టీచర్లున గీత, శ్యామలకు తెలిపినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు.

నిందితుడిపై పోక్సో కేసు..

చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు సహా పలు సక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. స్కూల్‌లో ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రిన్సిపాల్, విషయం తెలిసినా బయటకి చెప్పని ముగ్గురు ఉపాధ్యాయులు సహా మొత్తం ఐదు మందిని పోలీసులు తఅరెస్టు చేశారు.