calender_icon.png 1 December, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలందరూ సహకరిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం.. డిపో మేనేజర్ రాజశేఖర్

01-12-2025 12:36:22 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో వ్యాపారులు, ప్రజలు అందరూ సహకరిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రతినిత్యం పదులలో బస్సులు వచ్చి రోడ్లపై బస్టాండు లేక నిలుపుతున్నారని అన్నారు. మండల ప్రజలందరూ బస్టాండ్ నిర్మాణం కోసం సహకరిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. బస్టాండ్ నిర్మాణంతోపాటు మౌలిక వసతులు సైతం కల్పిస్తామని బస్టాండ్ నిర్మాణం కోసం ప్రజలందరూ కలిసి తీర్మానం చేస్తే బస్టాండ్ నిర్మాణం కోసం వెంటనే నివేదికను ప్రభుత్వానికి పంపించి బస్టాండ్ నిర్మాణం పనులు చేపడతామని తెలిపారు.వారి వెంట ఏడీసీ పోశం, ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఉన్నారు.