01-12-2025 12:32:50 PM
ఎస్సై సర్తాజ్ పాషా
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల దృశ్య రహదారులపై ఎవరు కూడా వాహనాలు నిల్పకూడదని ఎస్సై సర్తాజ్ పాషా వాహనదారులకు సూచించారు. 100 మీటర్ల దూరం వరకు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బందు పాటించి సహకరించాలని వ్యాపారులకు సూచించారు. ఎవరు కూడా రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండకూడదు అని తెలిపారు. ఎన్నికల నియమావళి పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు సూచించారు.