calender_icon.png 30 January, 2026 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల ప్రకారం నామినేషన్ ప్రక్రియ

30-01-2026 12:00:00 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జనవరి 29 (విజయక్రాంతి): ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ నామినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల అధికారులను ఆదేశించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు.

నామినేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి టీ పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.

నామినేషన్ కేంద్రాలు, హెల్ప్ డెస్క్, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ద్వారా ఎన్నికల సిబ్బంది విధులను పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, షిఫ్టుల వారీగా 24 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించారు. చొప్పదండి నామినేషన్ కేంద్రాల పరిశీలనచొప్పదండి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా చొప్పదండి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. కలెక్టర్ వెంట చొప్పదండి మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఉన్నారు.