calender_icon.png 30 January, 2026 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్ కోడ్స్ రద్దు కోసం ఫిబ్రవరి 12న సమ్మె

30-01-2026 12:00:00 AM

సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు 

సుల్తానాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి బస్టాండ్ వద్ద ఫిబ్రవరి 12 న జరుగు సమ్మెను జయప్రదం చేయాలని గురువారం కార్మిక సంఘం నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు లాభం చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ ను తెచ్చిందని, వీటి మూలంగా సమ్మె హక్కు నిర్వీర్యం కావడం, పనిగంటలు 12 గంటలకు పెరగడం, వేతనాల పెంపు, కార్మికుల సం క్షేమం లేకుండా పోతుందని, కార్మికులపై పని భారం, అభద్రత పెరుగుతుందని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ అసాధ్యం అవుతుందని అన్నారు.

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేయాలని పిలుపునిచ్చాయని, అందులో భాగంగా జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు...ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, రైస్ మిల్ గుమస్తాల యూనియన్ అధ్యక్షులు మాతంగి రాజమల్లు, రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మ చారి, పురం హరికిషన్ రావు, బండారి స్వామి, సుధాకర్ రావు, తిరుపతి, మహేందర్, రాజేశం, కొమురయ్య, సతీష్, కుమార్, రాజేశం, శోభన్, శీను, లక్ష్మి రాజాం, తదితరులు పాల్గొన్నారు.