30-01-2026 12:00:00 AM
కరీంనగర్‌పై బండి, గంగుల ప్రత్యేక దృష్టి
కరీంనగర్, జనవరి29(విజయక్రాంతి); మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటి తో ముగియనింది. కరీంనగర్ పార్లమెంటుపరిధిలోరాజకీయ పార్టీల కదలికలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పట్టణ రాజకీయాలు వేడెక్కాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధి లోని కరీంనగర్ నగరపాలక సంస్థ, హుజురాబాద్, జమ్మికుంటా, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో త్రి ముఖ పోటీ నెలకొంది. ఎన్నికల సమరం రోజురోజుకీ మరింత ఉత్కంఠను పెంచుతోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల వర కు అందరూ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.పార్ల మెంటు పరిధి లోని కీలకమైన కరీంనగర్ కా ర్పొ రేషన్ పై మూడు ప్రధాన పక్షాలు ప్రత్యే క దృష్టి సారించాయి.
ఈ కార్పొరేషను ద క్కించుకోవడం ద్వారా కీలకమైన కరీంనగర్ లో పాగా వేయవచ్చని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దీంతో క రీంనగర్ కార్పొరేషన్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.కరీంనగర్ లో66 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేషన ను కైవసం చేసుకునేందుకు 34 స్థానాలు గెలుచుకోవడం అవసర మవుతుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కరీంనగర్ కార్పొరేషన్ పై ప్రత్యేక దృష్టి సా రించారు. ఈసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొని కాషాయ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతు న్నారు.బి ఆర్ ఎస్ పార్టీ 2014,2020 ఎన్నికల్లో మెజార్టీ సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ పొందాలని ఆ పార్టీ ఆశిస్తున్నది.
జిల్లా కేంద్ర ని యోజకవర్గమైన కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గ పరిధిలోని కీలకమైన కరీంనగర్ కార్చొ రేషన్ దక్కించుకోవడం ద్వారా తనపట్టు ని రూపిం చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అన్నీ తానే అయి ఇక్కడి గెలుపు బా ధ్యతను తనపై వేసుకున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒ క్క సీటు కూడా సాధించింది. ఈ సారి జెం డా ఎగరేయలని చూస్తుంది. మాజీ కార్పొరేటర్ లను చేర్చుకొని బలం పెంచుకునే ప్ర యత్నం చేసింది. నేతల మధ్య సమ్బయం పెంచేందుకు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు.మద్దతుతోనే ఏ పార్టీకి అయినా మే యర్ పీఠం దక్కుతుందని ధీమా వ్యక్తం చే స్తోంది ఎం ఐ ఎం పార్టీ దీంతో ఇప్పుడు అం దరి దృష్టి కరీంనగర్ పై ఉంది.