calender_icon.png 29 January, 2026 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

29-01-2026 04:48:30 PM

ఎన్నికల నిర్వహణ పక్కాగా నిర్వహిస్తాం....జిల్లా కలెక్టర్

తాండూరు,(విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో  నామినేషన్ ప్రక్రియను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నామినేషన్ ప్రక్రియ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని . ..నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. 

1 నుండి 36 వార్డులు 12 కౌంటర్లు, 12 మంది ఆర్ ఓ లు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు  కలెక్టర్ తెలిపారు. నామినేషన్లు దాఖ లు చేసే విషయం లో  అభ్యర్థు లకు అవసరమైన సహకారం అందించాలని, ఏమైనా సందేహాలు ఉంటే సొంత నిర్ణయం తీసుకోకుండా పై అధికారులను సంప్రదించాలని  సూచించారు.  జిల్లా లో మొత్తం 100 వార్డ్స్, 261 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం తో పాటు 54 సమస్యా త్మ క లొకేషన్ లు గుర్తించి పూర్తి స్థాయి లో పోలీస్ బందోబస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు... ఆర్ ఓ లు, ఓ ఆర్  ఓ లు 20% అదనంగా  సిబ్బంది ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా చూస్తామన్నారు.