calender_icon.png 29 January, 2026 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు-టీవీఎస్ ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు

29-01-2026 04:37:38 PM

మర్రిగూడ జనవరి 29 (విజయక్రాంతి): కారు టీవీఎస్ ఎదురెదురు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలైన సంఘటన మర్రిగూడ మండలం బట్లపల్లి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హైదరాబాదుకు చెందిన వ్యక్తి నాంపల్లి నుంచి కారులో వెళుతుండగా బట్లపల్లి గ్రామ శివారులో నాంపల్లి మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన వీరా నాయక్   నరసింహ అనే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ పై ఎదురుగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు చికిత్స నిమిత్తం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో అంబులెన్స్ లో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదు కు తరలించారు. అనంతరం సంఘటన స్థలానికి  మర్రిగూడ పోలీసులు కారును టీవీఎస్ ను స్వాధీన పరచుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇరువైపుల నుండి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు