calender_icon.png 29 January, 2026 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక సేవలకే ప్రాధాన్యత

29-01-2026 04:55:09 PM

మందమర్రి  జీ.ఎం రాధాకృష్ణ 

 కే.కే 1 డిస్పెన్సరి లో ఫిజియో సెంటర్ ప్రారంభం 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): సింగరేణి యజమాన్యం కార్మికుల వైద్యసేవల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ అన్నారు. గురువారం మందమర్రి కేకే1 డిస్పెన్సరి ఆవరణలో నూతనంగా నిర్మించిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మందమర్రి ఏరియాలోని కార్మికులు,రిటైర్డ్ కార్మికులకు ఈ సెంటర్ ఏర్పాటుతో ఎంతో లాభం జరుగుతుందన్నారు. ప్రతీ దానికీ మందులు మింగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అన్నారు. కీళ్ల సమస్యల్లో సింహభాగం ఎక్సర్సైజ్, ఫిజియో థెరపీ ల ద్వారా నివారించవచ్చున్నారు. గతంలో మనుషులు చాలా కష్టపడేవాళ్లని,కానీ నవీన సమాజంలో కష్టం తగ్గిందన్నారు. ఫలితంగా చాలా జబ్బులు వస్తున్నాయన్నారు. అందుకే జీవితంలో మార్నింగ్ వాక్, ఎక్సర్సైజ్ ను అలవాటు చేసుకోవాలన్నారు.

ఫిజియో సెంటర్ ను అవసరం మేరకు పరికరాలను పెంచి ఆధునీకరిస్తానని హామీ ఇచ్చారు. గుర్తింపు కార్మిక సంఘం ఏరియా కార్యదర్శి సలేoద్ర సత్యనారాయణ మాట్లాడుతూకార్మికులు సింగరేణి కల్పిస్తున్న వైద్యసేవలను ఉపయోగించుకోవాలన్నారు. కేకే1 డిస్పెన్సరీలో హెచ్ 1బిఏ సి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ నిర్ధారిత రక్త పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీ వైసీఎంఓ,డాక్టర్ మధుకుమార్ మాట్లాడుతూ ఫిజియో థెరపీ ద్వారా పలు లాభాలుంటాయన్నారు. ఎస్ వో టు జీ ఎం జీ.ఎల్.ప్రసాద్,DGM పర్సనల్ అశోక్, సివిల్ S.E శ్రీధర్,మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కే.నాగేశ్వర్ రావులు, డిస్పెన్సరీ ప్రధాన కార్యనిర్వహణ క్లర్క్ హెచ్. రవీందర్, ఏఐటీ యూసీ జీఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ రమణ ,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

జీఎంను సన్మానించిన రిటైర్డ్ కార్మికులు..

మందమర్రి ఫిజియో థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎ న్.రాధాకృష్ణ, డీ.వై.సి.ఎం.వో. డాక్టర్ మధుకుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కే.నాగేశ్వర్ రావులు సింగరేణి రిటైర్డ్ కార్మికులు శాలువాలు కప్పి సన్మానించారు. రిటైర్డ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు వాసాల శంకర్,దాసరి రామన్న, కంబాల రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.