29-01-2026 04:46:21 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ముద్రకోల భార్య-భర్తలు బాలరాజు, మంజుల మెదక్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడుప్రమాదంలో మృతిచెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు ముద్రకోల అభిలాష్ తీవ్రంగా గాయపడి కామారెడ్డి మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదానికి స్పందిస్తూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని అభిలాష్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. డాక్టర్లను సంప్రదించి, గాయపడ్డ వ్యక్తికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్న సూచనలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబానికి అన్ని సందర్భాలలో మద్దతుగా ఉంటానని భరోసా ఇచ్చారు.