04-12-2025 10:12:04 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో రెండో రోజు నామినేషన్లు ఊపందుకున్నాయి. 36 పంచాయతీల్లో 61 నామినేషన్లు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు ఎంపీడీఓ మల్లేశ్వరి గురువారం తెలిపారు. 36 పంచాయతీల్లోని వార్డుల్లో నామినేషన్లు వార్డు అభ్యర్థులుగా నామినేషన్లు వేసినట్లు వెల్లడించారు. శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల్లో హడావిడి మరింత ఊపందుకుంది. ఒక వైపు అభ్యర్థుల కోసం వెతుకులాట, మరోవైపు రెబల్స్ ను బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడతలో పంచాయతీ ఎన్నికలకు మొత్తం మీద శుక్రవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది.