04-12-2025 10:15:17 PM
పగడ్బందీగా సర్పంచ్ ఎన్నికలు జరిపేందుకు చర్యలు..
సాధారణ ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి లు సందర్శించారు.అధికారులు స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు.
ఈ సందర్భంగా, మొదటి విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 10 మండలాలకు పంపిణీ చేస్తున్న బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పంపిణీ, భద్రపరిచే విధానం తదితర అంశాలను పరిశీలించారు. మండలాలకు చేరుకున్న బ్యాలెట్ పేపర్లను సంబంధిత ఎంపీడీఓలు, స్ట్రాంగ్ రూమ్ లో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భద్రపరచాలని తెలిపారు.జిల్లా పరిపాలన ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, భద్రతతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో చందర్, ఎస్ టి ఓ ఎక్సపెండేచర్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.