04-12-2025 10:21:53 PM
పొలంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొండి మల్లేశం
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన కొండి మల్లేశం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ తనని ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపిస్తానంటూ అన్నారు. గ్రామంలో ప్రధానమైన సమస్య మంచినీరు, నిరుద్యోగ సమస్య, తనను గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించినట్లయితే గెలిచిన వెంటనే ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేటట్లు చేస్తా అని, యువతకు గ్రామంలో ఉన్న కంపెనీలో ఉపాధి కల్పించడమే ద్యేయమని, గ్రామంలో ప్రధాన వీధుల కుండా దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలుపుతానని, ప్రజకు ప్రజలకు విశ్వాస సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.