04-12-2025 10:49:32 PM
ఎస్ఐ చిరంజీవి
తుంగతుర్తి (విజయక్రాంతి): ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై చిరంజీవి అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లాలో స్థానిక ఎన్నికలపైన ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కండక్ట్ ఆఫ్ ఎన్నికల కోడ్ ను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రచారాలకు మైకులకు అనుమతి తప్పనిసరి. ఎన్నికలలో ప్రత్యర్థి అభ్యర్థులపై ఎటువంటి దుష్ప్రచారాలు చేసిన ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ లు కిరణ్ నాగరాజు సైదులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.