04-12-2025 10:32:10 PM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, బాలరాజ్‌పల్లి గ్రామాలకు చెందిన పలువురు నేతలు గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం అందరూ సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.