31-01-2026 02:26:04 AM
జగన్గూడా మున్సిపాలిటీ నుంచి పలువురు
భువనగిరి జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు
హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): జగన్గూడా మున్సిపాలిటీ, భువనగిరి జిల్లా నుంచి శుక్రవారం పలువురు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)లో చేరారు. జగన్గూడా మున్సిపాలి టీ పరిధిలో పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో టీఆర్పీ లో చేరారు. మున్సిపాలిటీ 15వ వార్డు నుంచి టీఆర్పీ తరఫున ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అశ్వినీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వయంగా అశ్వినీకి బీ-ఫారమ్ అందజేసి పార్టీ పూర్తి మద్దతు ప్రకటించారు. బీసీలకు రాజకీయంగా న్యాయం జరగాలనే లక్ష్యంతో అశ్వినీకి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
అశ్వినీ విజయం కోసం నేనే స్వయంగా ప్రచారానికి వస్తాను అని హామీ ఇచ్చారు.అలాగే భువనగిరి జిల్లా ఇన్‌చార్జి కొమ్రిశెట్టి నర్సింహులు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్పీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీఆర్పీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్ల న్న మాట్లాడుతూ ప్రజల హక్కులు, బీసీ వర్గాల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు. టీఆర్పీలో చేరినవారు మోతి తిరుపతి, వెంకటమ్మ, గర్వ నరేష్, మోతి చంద్రశేఖర్, మోతి చరణ్, మోతి బాలకృష్ణ, సోనీ, సునీత ఉన్నారు.