calender_icon.png 6 May, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్‌స్టిక్‌తో నష్టాలే అధికం

04-05-2025 12:00:00 AM

జీవనశైలి కారణంగా చాలామంది మహిళలు రంగురంగుల నాన్‌స్టిక్ పాత్రలు వాడుతున్నారు.  ఈ రంగురంగుల పాత్రల్లో వంట చేసేటప్పుడు తక్కువ నూనెను ఉపయోగించడమే కాకుండా వినియోగించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. జీవితాన్ని సులభతరం చేసే ఈ నాన్‌స్టిక్ పాత్రలతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వంట కోసం ఉపయోగించే ఈ నాన్‌స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

భారతీయుల కోసం జారీ చేసిన కొత్త ఆహార మార్గదర్శకాల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) నాన్‌స్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వండకూడదని సూచించారు. ఎన్నో ఏళ్లుగా నాన్‌స్టిక్ పాత్రల్లో ఆహారాన్ని  వండటం వల్ల శరీరంలో టెప్లాన్ పరిమాణం పెరుగుతుందని, దీనివల్ల మనిషికి అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. నాన్‌స్టిక్ ప్యాన్‌లలో సింథటిక్ పాలిమర్‌లు ఉంటాయి.

వీటిని పాలిటెట్రా ప్లోరో ఎథిలిన్, టెప్లాన్ అని కూడా అంటారు. అటువంటి పరిస్థితిలో టెప్లాన్ నుంచి అధిక మంటపై విడుదలయ్యే రసాయనాలు వంధ్యత్వం, గుండె సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి. అధిక మంటపై నాన్‌స్టిక్ వంటసామాను వేడిచేసినప్పుడు వాటి నుంచి విడుదలయ్యే రసాయనాలు విషపూరితమైన పొగను గాలిలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల పొగ క్యాన్‌కు గురైన వ్యక్తులకు శ్వాసకోశ సమస్యలు థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

నాన్‌స్టిక్ పాన్‌ను ఖాళీగా వేడిచేసినప్పుడు.. దాని నుంచి కొన్ని వాయువులు విడుదలవుతాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి కడుపు నొప్పిని కూడా కలిగిస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద వండటం వల్ల లేదా ఎక్కువసేపు నాన్‌స్టిక్ పాత్రలు వాడటం వల్ల వాటిపై పూత పోవడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితిలో ఈ పాత్రలపై ఆహారాన్ని వండినప్పుడు, నాన్‌స్టిక్ పూత ఆహారంలో కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యానికి హాని కలిగించే హానికరమైన రసాయనాలు కడుపులోకి వెళతాయి.