calender_icon.png 6 May, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలర్జీతో చెవినొప్పి!

04-05-2025 12:00:00 AM

అలర్జీ అనగానే తుమ్ములు, ముక్కు దిబ్బడ, కళ్లు దురద పెట్టటం, ఉబ్బటం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ చెవి నొప్పి, దురద కూడా వస్తాయంటున్నారు నిపుణులు. అప్పటికే చెవినొప్పి ఉంటే అది తీవ్రం కావొచ్చంటున్నారు. చెవి బయట, మధ్యన, లోపలి.. ఇలా మూడు భాగాలుగా నొప్పి ఉంటుంది.

మధ్య చెవి నుంచి వచ్చే సన్నటి గొట్టం (యూస్టేషియన్ ట్యూబ్) ముక్కు వెనకాల కలుస్తుంటుంది. ఇది మధ్య చెవి నుంచి ద్రవాలను బయటకు తీసుకు వస్తే లోపల ఒత్తిడి తగ్గుతుంది. అలర్జీతో ముక్కు బిగుసుకుపోతే వాచిన కణజాలం యూస్టేషియన్ గొట్టాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా మూసేయొచ్చు. దీంతో పొడుస్తున్నట్టుగా లేదా స్వల్పంగా నొప్పి పుట్టొచ్చు. చెవి దిబ్బడ వేసినట్టుగాను అనిపించొచ్చు.