ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నోట్ బుక్స్ పంపిణీ
వనపర్తి మండలం, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అందజేసిన ఉచిత నోట్బుక్స్ను వనపర్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పి. ఆనంద్ బుధవారం విద్యార్థినీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలతో పాటు నోట్బుక్స్ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందన్నారు.
కళాశాలకు మొత్తం 9,792 నోట్బుక్స్ వచ్చాయని, ప్రతి విద్యార్థినికి 12 నోట్బుక్స్ చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో యూనిఫాం, షూలు కూడా అందజేయనున్నట్లు పేర్కొంటూ, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో లైబ్రేరి యన్ జి. నర్సింహులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.






