6 August, 2026 | 2:30 AM

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌పై ప్రాథమిక సర్వే

06-08-2026 12:25 AM

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఎన్‌హెచ్‌ఏఐ బృందం పరిశీలన

అచ్చంపేట, ఆగస్టు 5 (విజయ క్రాంతి) : మన్ననూర్‌శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక సాంకేతిక పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం బుధవారం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పర్యటించింది. దోమలపెంటలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర,  అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్ వెంట ప్రాథమిక సర్వే నిర్వహిస్తూ, నిర్మాణం వల్ల వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జీవవైవిధ్యంపై కలిగే ప్రభావాలను అంచనా వేశారు. అవసరమయ్యే అటవీ భూమి మళ్లింపు అంశాలను కూడా పరిశీలించారు. నిర్మాణ దశలోనూ, నిర్మాణానంతరం పర్యావరణ వ్యవస్థపై పడే ప్రభావాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరంపై అధికారులు చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ప్రాథమిక సాధ్యాసాధ్యాల పరిశీలన మాత్రమేనని, సమగ్ర సాంకేతిక అధ్యయనాలు, పర్యావరణ ప్రభావ అంచనాలు, వన్యప్రాణుల పరిరక్షణకు సంబంధించిన నివేదికలు పూర్తున తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.