స్వయం ఉపాధితోనే ఆర్థిక స్వావలంబన
06-08-2026 01:17 AM
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
బడంగ్పేట్ ఆగస్టు ౫ (విజయక్రాంతి): బడంగ్పేట్ సర్కిల్ ప్రజాభవన్లో సహోదరి ఫౌండేషన్, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిఫామ్ టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మహేశ్వరం ఎమ్మెల్యే పి. స బితా ఇంద్రారెడ్డి సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
శిక్షణ పొందిన మహిళలు తమ నైపుణ్యంతో ఉపాధి పొంది కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.సహోదరి ఫౌండేషన్ (డాక్టర్ స్వర్ణ లత) సేవలను అభినందిస్తూ.. ఇలాంటి శిక్ష ణా శిబిరాలను మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని గ్రా మాలు, డివిజన్లలోనూ నిర్వహించాలని సూ చించారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మెప్మా, సహోదరి ఫౌం డేషన్ ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.






