calender_icon.png 4 May, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్లయినా చలామణీలోనే 2 వేల నోట్లు

03-05-2025 02:04:26 AM

వాటి విలువ 6వేల కోట్లకు పైమాటే: ఆర్బీఐ

న్యూఢిల్లీ, మే 2: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) ఉపసంహరించుకొని దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇంకా చలామణీలోనే ఉన్నాయి. తాజాగా ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకా రం ఏప్రిల్ 30, 2025 నాటికి రూ.6, 266 కోట్ల విలువైన 2 వేల నోట్లు ప్రజల వద్ద గణనీయంగా ఉన్నాయని పేర్కొంది.

ఇప్పటివరకు 98.24 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి రాగా.. మిగిలినవి కూడా త్వరలోనే తిరిగి వస్తాయని ఆశిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. రూ. 2వేల నోట్ల ను ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2023 మే 19న ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.