calender_icon.png 30 July, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ అవినీతిపై విచారణ ఏది..?

29-07-2025 01:50:56 PM

కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్న గ్రామస్తులు, కూలీలు

చిట్యాల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరు పల్లి జీపి పరిధిలో జరిగిన ఉపాధి హామీ పథకం అవినీతిపై విచారణ ఎందుకు చేపట్టడం లేదని ఆ ఊరి గ్రామస్తులు, కూలీలు ప్రశ్నిస్తున్నారు.గత ఐదు సంవత్సరాల  నుండి జరిగిన ఉపాధి హామీ పనుల్లో పలు అక్రమాలు జరిగాయని, గతంలో ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా విచారణ చేపట్టారని ఆరోపించారు. ప్రస్తుతం సైతం జరిగిన అవినీతిపై ఆధారాలతో సహా వెల్లడించిన అధికారులు పట్టించుకోకపోవడం వెనక అంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు మన్నెం శ్రీనివాసరావు, పువ్వాటి హరికృష్ణ,సదాశివరావు, శ్రీకాంత్, శేషగిరిరావు, రామకృష్ణ, శ్రీనివాస్,నాగరాజు తదితరులు కూలీలు, గ్రామస్తులు తెలిపారు.