29-07-2025 01:46:43 PM
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ ఎందుకు ఆపేశారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. యుద్ధాల వల్ల అనేక తీవ్ర పరిణామాలు వస్తాయని విపక్ష సభ్యులకు తెలియదా.. నెహ్రూ నిర్ణయం వల్ల జమ్ము కాశ్మీర్ లో అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. మన భద్రతాదళాలు పాకిస్థాన్ వైపు ముందుకెళుతుంటే నెహ్రూ అడ్డుకున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్ యుద్ధంలో జనరల్ మాణిక్ షా(General Manekshaw) వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పాకిస్థాన్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నిస్తోంది? పవాల్గాం లాంటి దాడులు జరిగితే కాంగ్రెస్ లా తాము చూస్తూ కూర్చోలేం అన్నారు. జమ్ము కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులను మేం సరిచేస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని సీసీఎస్ నిర్ణయం తీసుకుంది. దేశప్రజల ఆశలు, ఆకాంక్షలు గమనించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని హెచ్చరించారు. పవాల్గాం దాడి కేవలం పర్యాటకులపై కాదు.. దేశంపై దాడిగా పరిగణిస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. పవాల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని తెలిపారు.
ఆనాడు 140 కోట్ల మంది ప్రజల గుండెచప్పుడును మోదీ(Narendra Modi) వివరించారని గుర్తుచేశారు. దాడులు చేసేందుకు భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టాం.. 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశాం.. మన భద్రతాదళాల దాడుల్లో ఒక్క పౌరుడు కూడా మరణించలేదని ఆయన వివరించారు. వంద కిలో మీటర్లు వెళ్లి పాక్ లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశామని చెప్పారు. భద్రతాదళాల దాడుల్లో పలువురు ఉగ్రవాద నేతలు కూడా హతమయ్యారని అమిత్ షా తెలిపారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని స్పష్టం చేశారు. పాకిస్థాన్ దాడుల్లో ఇక్కడి గురుద్వారా, దేవాలయం ధ్వంసం అయ్యాయన్నారు. ఆపరేషన్ సిందూర్ లో పాక్ లోని 8 ఎయిర్ బేస్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు(Congress leaders) ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. మే 10న పాక్ డీజీఎంఓ ఫోన్ చేశారు.. యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేశారు. దేశరక్షణ విషయాల్లో నెహ్రూ నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. నెహ్రూ మనదేశంలోని 80 శాతం జలాలను పాక్ కు అప్పగించారని చెప్పారు.
ఆ మిమ్మల్ని ప్రశ్నించే అధికారం కాంగ్రెస్ కు లేదు
జమ్ము కాశ్మీర్(Jammu and Kashmir) విషయంలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం కాంగ్రెస్ కు లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ తేల్చిచెప్పారు. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అన్నారు. పోటా చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఘనత కాంగ్రెస్ నేతలదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు అందరికీ తెలుసన్నారు. యూపీఏ ఎవరి ప్రయోజనాల కోసం పోటా చట్టం రద్దు చేసింది? అని ప్రశ్నించారు. పోటా చట్టం రద్దు చేశాక దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్ర దాడులు జరిగాయని చెప్పారు. పోటా చట్టం రద్దు చేశాక జరిగిన ఉగ్రదాడుల్లో వందలాది మంది చనిపోయారు. ఉగ్రదాడులు జరుగుతుంటే యూపీఏ ప్రభుత్వం(UPA Government) ఏం చేసిందో చెప్పాలి? అని ప్రశ్నించారు. ఉగ్రదాడుల్లో దేశ ప్రజలు చనిపోతుంటే యూపీఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 2014 నుంచి జమ్ము కాశ్మీర్ లో పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. జమ్ముకశ్మీర్, పీవోకే, ఉగ్రవాదులపై కాంగ్రెస్ వైఖరి అందరికీ తెలిసిందే. మీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశ పరిస్థితి ఇలా ఉందన్నారు. ఎవరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారో దేశ కాంగ్రెస్ నేతలు చెప్పాలి? అని అమిత్ షా ప్రశ్నించారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ వైఖరి సరికాదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ పై నిన్న రాజ్ నాథ్ సింగ్ వివరంగా చెప్పారని అమిత్ షా తెలిపారు. పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారని, మృతుల్లో నేపాల్ వ్యక్తి కూడా ఉన్నారని అమిత్ షా పేర్కొన్నారు.