29-07-2025 02:29:09 PM
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ సమీపంలోని మెదక్-సిద్దిపేట రహదారిపై మంగళవారం ఓ ఆటోరిక్షా డ్రైవర్, మోటార్ సైకిల్ నడిపే వ్యక్తిపై భారీ చింత చెట్టు(Tamarind tree falls) కూలిపోవడంతో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో ఆటో రిక్షా పూర్తిగా దెబ్బతింది. మోటార్ సైకిల్ కూడా దెబ్బతింది. ఆటో డ్రైవర్ తలకు రక్తస్రావం కాగా, బైకర్ గాయాలతో బయటపడ్డాడు. చెట్టు కూలడం వల్ల రద్దీగా ఉండే రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సిబ్బందిని మోహరించి, జెసిబిలను రప్పించి చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.