29-07-2025 02:22:01 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(Kalvakuntla Taraka Rama Rao) తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) సవాల్ విసిరారు. సీఎం రమేష్(CM Ramesh) ఇంటికి వెళ్లిన విషయంపై కేటీఆర్ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు..? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తో కుమ్మక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు తేడా వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వెళ్లాయా? ఈ విషయంపై కేటీఆర్ గుండెపై చేయివేసుకొని క్లారిటీ ఇవ్వాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.