29-07-2025 01:54:56 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జూలూరు యాదగిరితో కలిసి వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. నేడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి చెట్లు మాత్రమే ఉపయోగపడతాయని తెలిపారు. దీనికోసం ప్రజలంతా అటవీ శాఖతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చూడాలన్నారు.