calender_icon.png 3 May, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ మేనల్లుడిపై సెబీ ఆరోపణలు

03-05-2025 02:07:47 AM

కంపెనీ సమాచారాన్ని పంచుకున్నట్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, మే 2: ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ మేనల్లుడు ప్రణవ్ అదానీపై మా ర్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ప్రణవ్ కంపెనీ ఒప్పంద సమాచారం రహస్యంగా పంచుకున్నా రని, తద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి నిబంధనలు ఉల్లఘించారని ఆరోపించింది.

దీనికి సంబం ధించి సెబీ గతేడాది ప్రణవ్ అదానీకి నోటీసులు కూడా ఇచ్చింది. తన మీద వచ్చిన ఆరోపణలపై ప్రణవ్ ఏనాడు స్పందించలేదు. తాజాగా ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించేందుకు తనపై వచ్చిన ఆరోపణ లకు తగిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానని, ఎటువంటి సెక్యూరి టీల చట్టాన్ని ఉల్లఘించలేదని ప్రణ వ్ పేర్కొన్నారు.

కాగా ప్రణవ్ 2021 లో ఎస్‌బీ ఎనర్జీ హోల్డింగ్స్‌ను అదానీ గ్రీన్ ఎనర్జీ కొనుగోలు చేసే సమాచారాన్ని ఒప్పందం కంటే ముందుగా తన సన్నిహితులతో పంచుకున్నట్టు సెబీ పేర్కొంది. ఈ విషయంపై దర్యాప్తు సమయంలో కాల్ రికార్డులు, ట్రేడింగ్ విధానాలను సెబీ అధికారులు విశ్లేషించా రు. ప్రణవ్ అదానీ సన్నిహితులు కునాల్ షా, నృపాల్ షా అదానీ గ్రీన్ షేర్లను క్రయవిక్రయాల ద్వారా రూ.90 లక్షలకు పైగా లాభాలను ఆర్జించారని సెబీ వెల్లడించింది.