03-05-2025 02:02:25 AM
బ్యూనస్ ఐరిస్, మే 2: చిలీ, దాని పొరుగుదేశం అయిన అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూ కంప తీవ్రత 7.4గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే ధ్రువీకరించింది. భూకంపం తర్వాత చిలీలో సునామీ హెచ్చరికలు కూ డా జారీ చేశారు. అర్జెంటీనాలోని ఉషుయా కు దక్షిణంగా 219 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చిలీలోని మాగెల్లన్ తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.