calender_icon.png 30 January, 2026 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవు

30-01-2026 12:00:26 PM

హైదరాబాద్: కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)కు ఇచ్చిన సిట్ నోటీసులు(SIT Notices) చెల్లవని బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు(Supreme Court BRS Advocate) వెల్లడించారు. సీఆర్పీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నోటీసులు ఇచ్చారని వివరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. చట్టబద్ధంగా ఆంక్షలు ఉన్నందున కేసీఆర్(KCR)కు నోటీసులు ఇవ్వలేరని వెల్లడించారు. 65 ఏళ్లు దాటినవారిని ఇంటికి వెళ్లి విచారించాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అన్నారు. ఏళ్ల తరబడి విచారణకు పిలుస్తామంటే కుదరని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని మోహిత్ రావు స్పష్టం చేశారు.

సిట్ అధికారులు నిన్న నందినగర్ నివాసంలో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసు ఇవ్వనున్నట్లు సమాచారం. లీగల్ ఒపీనియన్ తర్వాత మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ లేఖకు సిట్ ఈరోజు సమాధానం ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్‌కు 160 సీఆర్పీసీ కింద సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. కేసీఆర్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకు ప్రశ్నిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.