06-12-2025 12:32:53 AM
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): హిల్ట్ పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.
ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్ చేసి ఫోరెనిక్స్ ఆ డిట్ చేయించాలని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చే సింది. వెంటనే రిప్లు ఫైల్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుప రి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.