06-12-2025 12:32:30 AM
300 క్వింటాల బియ్యం అక్రమ రవాణా
భద్రాద్రి జిల్లాలో గుర్తించిన సివిల్ సప్లై అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రేషన్ డీలర్లు, ఎమ్ ఎల్ ఎస్ పాయింటు సిబ్బంది రేషన్ బియ్యం అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న విష యాన్ని సివిల్ సప్లు అధికారులు గుర్తించారు. లారీకి నకిలీ రసీదుల కోసం మండల లెవెల్ స్టాక్ పాయింట్ (ఎం ఎల్ ఎస్) సిబ్బంది అందిన కాడికి దండుకొని తప్పుడు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఈ ఘరానా మోసానికి పాల్పడుతున్నట్లు ఎట్టకేలకు గు ర్తించారు.
ప్రతి లారీకి రూ.50 వేలు వసూ లు చేసి ఇప్పటివరకు ఐదు సార్లు బియ్యాన్ని తరలించినట్లు తెలుస్తోంది. పేదలకు అందాల్సిన సన్నబియ్యం తరలించేందుకు జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థను మార్చి లారీలను మణుగూరుకు చెందిన రైస్ మిల్లర్ నరహరికి తరలించినట్లు అధికారులు గుర్తించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చౌక బియ్యం అక్రమ రవాణాపై చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ వివరాలను అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ శుక్రవారం వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర విజిలెన్స్ టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు ఈ నెల 2వ తేదీన పాల్వంచలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్ వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై ఒక యువకుడు స్టాక్ పాయింట్‌లోకి ప్రవేశించాడు.
ఎమ్‌ఎల్‌ఎస్ పాయిం ట్ ఇంచార్జి సత్యవతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ భానోత్ కృష్ణ కుమార్‌కు పత్రాలు అందజేయగా, వారు కొంత సమాచారం నమోదు చేసి తిరిగి ఆయనకు అందించారు. ఈ పరిణామంపై అనుమానంతో అధికారులు ప్రధాన గేటు వద్ద ఆ యువకుడ్ని ఆపి విచారించారు. అతని పేరు ప్రశాంత్ అని, ఆయ న స్టేజ్ వన్ కాంట్రాక్టర్ ఎస్ శ్రీనివాస్‌కు అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్టు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ మార్కెట్ గోదాం, మల్లారం నుంచి సరఫరా కావలసిన సన్నబియ్యంను మోటా ర్ సైకిల్ ద్వారా జిపిఎస్ టాకింగ్ వ్యవస్థను మార్చి లారీ నెంబర్ టిఎస్ 29 టి 5139 కి సంబంధించిన ట్రాక్ షీట్ నెంబర్ 4346 తో కలిసి జిసిసి స్టాక్ పాయింట్ తెచ్చి అక్కడ ఎమ్మెల్యే పాయింట్ సిబ్బందినీ కలిసి నకిలీ ఎంట్రీలు నమోదు చేయించి తిరిగి పంపారని నిర్ధారించారు.
దీంతో అసలు లారీలో ఉన్న 300 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఎంఎల్‌ఎస్ పాయింట్ సిబ్బంది, డీలర్లు కలిసి పత్రాలలో తప్పుడు నమోదు చేసి ప్రభుత్వానికి అధికంగా నష్టం కలిగించారు. పంచనామా, స్వీకార వాంగ్మూలాల ఆధారంగా ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
స్టేజ్ కాంట్రాక్టర్ గుర్తింపు
దర్యాప్తులో స్టేజ్ కాంట్రాక్టర్ ఎన్ శ్రీనివాసన్ అదుపులోకి తీసుకొ ని విచారించగా తాను, తన భార్య స రోజ పేరుతో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, మణుగూరుకు చెందిన రైస్ మిల్లర్ నరహరికి చౌక బియ్యం మ ళ్ళించేందుకు జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థను మార్చి లారీలను ఆ మెలకు తర లించేవాడినని అంగీకరించాడు. అం దుకుగాను ప్రతిఫలంగా లారీకి రూ. 50 వేలు చొప్పున 5 సార్లు తరలించినట్టు అంగీకరించాడు.
టీఎస్ 29 టి 5139 లారీ నగిరి పేట అవుట్ స్కర్ట్ లో గుర్తించి డ్రైవర్ అనిల్ కుమార్ ను విచారించగా రైస్ మిల్లర్ సూచన మేరకు లారీ నిలిపివేసినట్లు అంగీకరించాడు. లారీ స్వాధీనం చేసుకొని పంచుల సమక్షంలో చౌక బియ్యాన్ని రికవరీ చేశారు. తదుపరి విచారణలో ఎమ్మెల్యేస్ పాయింట్ ఇంచార్జ్ సత్యవతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ కృష్ణ కు మార్ ఇద్దరూ తప్పిదాలను అంగీకరించారు.
హమాలి నాగరాజు సహ కారంతో పలు చౌకడిపో డీలర్ల ఒత్తిడికి నకిలీ ఎంట్రీలు నమోదు చేసిన ట్లు వెల్లడించారు. డీలర్లు చౌక బి య్యం అందుకున్నట్లు బయోమెట్రిక్ సంతకాలు చేసి, అసలు బియ్యం స్వా ధీనం చేసుకోలేదని తేలింది.