calender_icon.png 20 January, 2026 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి

20-01-2026 12:00:00 AM

  1. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి: ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కే.కృష్ణుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయిం చాలన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, 40 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్ డీఏలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.