1 July, 2026 | 12:26 PM

ఇక శ్రీభూమిగా కరీంగంజ్

20-11-2024 12:13 AM

గుహవటి, నవంబర్ 19: అస్సాం ప్రభుత్వం కరీంగంజ్ జిల్లా పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కరీంగంజ్ జిల్లా పేరు శ్రీభూమిగా మార్చాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవార్థం పేరును మార్చాం. 100 ఏండ్ల కిందట కబిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక కరీంగంజ్ జిల్లాను ‘శ్రీభూమి’గా వర్ణించారు. ఆనాడు ఆ మహోన్నతుడు చెప్పిన మాటలను, ప్రజల డిమాండ్‌ను కేబినేట్ నెరవేర్చింది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.