2 July, 2026 | 2:29 AM

ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి

02-07-2026 12:46 AM

నిజాంసాగర్, జూలై 1(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ అవసరం ఉందని సమాచారం మేరకు  తక్షణమే స్పందించి   ఎన్‌ఆర్‌ఐ  భాస్కర్ రెడ్డి బుధవారం నాడు జూనియర్ కళాశాలకు కంప్యూటర్ను బహుకరించారు. విద్యార్థుల డిజిట విద్యాభివృద్ధి కోసం ఒక కంప్యూటర్ను విరాళంగా అందజేసి నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్  పాల్గొని భాస్కర్ రెడ్డి సేవాభావాన్ని అభినందించి, విద్యాభివృద్ధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.