తెలంగాణ పునఃనిర్మాణంలో ఎన్నారైలు భాగస్వామ్యం కావాలి
ఎన్‌ఆర్‌ఐల మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, మే 28 (విజయక్రాంతి) : తెలంగాణ పునఃనిర్మాణంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో మంగళవారం జార్జియాలోని అట్లాంటా నగరంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనకు సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ పునఃనిర్మాణంలో ఎన్నారైలు భాగస్వామ్యం కావాలన్నారు. తెలంగా ణలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సంక్షేమ పథకాలు విజయవంతంగా, ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నారైలు గుంటుక వెంకశ్వర్ రెడ్డి, అమెరికాలో ప్రముఖ విద్యావేత్త టీచర్స్ ప్లానెట్ సీఈఓ డాక్టర్ ముజీబుద్దీన్ మహమ్మద్ మంత్రి పొన్నంను కలిసి భువనగిరి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేయాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.






