29 July, 2026 | 11:36 PM

రైతుల కష్టాలు గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

29-05-2024 01:46 AM

రైతులపై చిత్తశుద్ధి ఉంటే ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి 

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్, మే 28: కొల్చారం మండలం పైతర, రంగంపేట, తుక్కాపూర్, కోనాపూర్ గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో అగ్నిప్రమాదం కారణంగా కాలిపోయిన ధాన్యాన్ని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యా న్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.

లారీల కొరతతో తూకం వేసిన ధాన్యాన్ని తరలించలేక రైతు లు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సి వస్తుందన్నారు. ధాన్యాన్ని మహబూబ్‌నగర్ తరలిస్తే 12 క్వింటాళ్ల ధాన్యా న్ని తరుగు తీస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. రైతుల కష్టాలు అధికారులెవరు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ది ఉంటే రైతుల కష్టాలు తీర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజూల, బీఆర్‌ఎస్ నాయకులు సంతోష్, అరిగె రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.