15 April, 2026 | 9:08 AM

ప్రవాసీ తెలంగాణ దివస్ నిర్వహించాలి: విఫ్ ఆది శ్రీనివాస్

30-12-2025 01:06 AM

హైదరాబాద్, డిసెంబర్  29 (విజయక్రాంతి): ప్రవాసీ భారత్ దివస్ తరహాలోనే ప్రవాసీ తెలంగాణ దివస్‌ను కూడా నిర్వహించాలి. టామ్ కామ్, నాక్‌ను బలోపేతం చేయాలి. గల్ఫ్ కార్మికులకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు సరళీకరించి వారికి అందించాలి. జీరో అవర్ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీ.రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, కేఆర్ నాగరాజు, వెడ్మ బొజ్జు, అనిల్ కుమార్, రాందాసు, మేఘారెడ్డి, రాజ్ ఠాకూర్, మందల సామేల్, సంజీవరెడ్డి, వేముల వీరేశం, మనోహర్‌రెడ్డి, రామచంద్ర నాయక్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కోవా లక్ష్మీ, మాణిక్‌రావు, అనిల్ జాదవ్, విజయుడు, ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాల వారి వారి నియోజకవర్గాల్లోని తదితర సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. వీటిపై ఆయా మంత్రులు స్పందించారు.