పర్యావరణ పరిరక్షణకు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు నడుం బిగించాలి
ఎం వి ఎస్ రెడ్డి
నల్లగొండ టౌన్, జూన్ 3: పర్యావరణ పరిరక్షణకు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు విద్యార్థులు నడుం బిగించాలని ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎం వి ఎన్ రెడ్డి అన్నారు. బుధవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రబోర్డు ఆధ్వర్యంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అనే అంశంపై విద్యార్థులకు ఎంజియూలో అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనల్ని మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకున్నప్పుడే పర్యావరణం సమతుల్యం అవుతుందని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యం గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన బాధ్యత జాతీయ సేవా పథకం వాలంటీర్స్ పైన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ కాలుష్యం పైన వ్యాసరచన పోటీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ రామచంద్ర, డాక్టర్ మ్యాతరి ఆనంద్, డాక్టర్ షరీఫ్, డాక్టర్, శ్రీనివాస్, రమేష్ నాయక్ , డా కట్ట కిరణ్ మయి, డాక్టర్ శ్రీధర్ రావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోడల్ ఆఫీసర్ శంకర్ బాబు, ఫీల్ అసిస్టెంట్ రాజేందర్, మౌనిక, ఫారెస్ట్ అధికారులు ఎల్లేశం, జాతీయ సేవా పథకం జూనియర్ అసిస్టెంట్ జిట్టా సాయి జాతీయసేవ పథకం వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.






