23-01-2026 09:13:06 PM
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండలోని ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగానికి పార్ట్ టైం (Hourly Basis) నియామకానికి అర్హత గల మహిళా అభ్యర్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం. హరిప్రియ తెలిపారు. ఈ నెల 27 లోపు తమ దరఖాస్తు పత్రాలను సమర్పించలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28న కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. వివరాలకు సెల్: 9908330585 సంప్రదించాలన్నారు.