calender_icon.png 17 July, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి విగ్రహానికి వెండి తొడుగు సమర్పణ

17-07-2025 01:45:28 AM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 16(విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని పలు అమ్మవార్ల దేవాలయాల అభివృద్ధి కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందజేయడం తమకు అదృష్టంగా భావిస్తున్నామన్నామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్  ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు.

అరుంధతి నగర్ బస్తి లోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి ఆలయంలో  అమ్మవారి విగ్రహ పునర్ ప్రతిష్టాపన ఇటీవల జరిగిన అనంతరం  బుధవారం అమ్మ వారి విగ్రహానికి సుమారు డ్బ్బు ఒక్క  తులా ల వెండితో చేయించిన చేతుర్భుజాలు (నాలుగు చేతులు) వెండి తొడుగులను కార్పొ రేటర్ ఎ.పావని వినయ్ కుమార్ దంపతులు అమ్మవారికి సమర్పించి అలంకరిం చారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ దేవాలయాలను కాపాడుకోవడం మన హిందు ధర్మమని, వాటిని అభివృద్ధి పరుచుకొని సంప్రదాయ బద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజించుకొని, దేవతల దీవెనలు పొందడం అనేదే సనాతన ధర్మ  పరిపాలన అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, శివ కుమార్, సురేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, బస్తి గుడి కమిటీ సభ్యులు ఎం. ఉమేష్, బెల్ బాటమ్ రాజు, సి.హెచ్ రాజు, పి. యదగిరి, నాగుల ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్, మెరుగు శ్రీనివాస్ యాదవ్, సరస్వతి, రాములమ్మ, నీలమ్మ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.