17-07-2025 01:44:14 AM
మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 16 (విజయక్రాంతి): యూఎస్‌లో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిం చారు. ఈ వేడుకలకు రావాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీడీఎఫ్ ప్రతినిధులు బుధవారం ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న టీడీఎఫ్‌ను అభినందించారు.
టీఎఫ్‌ఏఫ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వివిద గ్రామాల్లో టీడీఎఫ్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయం అని మంత్రి పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్‌రెడ్డి, పీడీఎఫ్ ఇండి యా చైర్మన్ యంవీ గోనరెడ్డి, ఇండియా జనరల్ సెక్రెటరీ వినీల్ తదితరులు ఉన్నారు.