17-07-2025 01:45:53 AM
మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 16 (విజయక్రాంతి)/కుత్బుల్లాపూర్: అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
బుధవారం కూకట్‌పల్లి జోన్‌లోని షిరిడి హిల్స్ కాలనీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్‌తో కలిసి మొక్కలు నాటారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజా భాగస్వామ్యంతో ఈ సీజన్ మొత్తం మొక్కలు నాటుతామన్నారు. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. ఆకుపచ్చని హైదరాబాద్ లక్ష్యంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు.