02-07-2025 07:28:39 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో బుధవారం కట్టమైసమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిని అలంకరించి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం కోళ్లు, మేకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాలనీ వాసులతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మైసమ్మను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల ఏకాంతం, బెజ్జంకి బ్రహ్మచారి, హేమ నాయక్, మాందాటి హనుమంతు, కొమ్ము భాస్కర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.