calender_icon.png 3 July, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుల్లో రాణిస్తున్న మానస

02-07-2025 07:22:19 PM

మఠంపల్లి: ఆర్థిక పరిస్థితులను అధిగమించి చదువుల్లో రాణిస్తోంది మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన ఉప్పతల మానస. మఠంపల్లి మాంటిఫోర్ట్ పాఠశాల(Montfort School)లో గత విద్యా సంవత్సరం పదో తరగతి పూర్తిచేసిన మానస 600 లకు 557 మార్కులు సాధించుకుని పాఠశాలలో ప్రధమ స్థానాన్ని, మండల స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించుకుంది. ఇక్కడి వీవీ ఉన్నత పాఠశాలలో గత 60 ఏళ్ల చరిత్రలో 557 మార్కులు ఎవరూ తెచ్చుకోలేదని ప్రిన్సిపల్ బ్రదర్ వినోద్ రెడ్డి చెప్పారు. ఇటీవల వెలువడిన పాలిసెట్ ఫలితాలలో మానస రాష్ట్రస్థాయిలో 2,117వ ర్యాంక్ సాధించుకుంది. ఇంటర్, ఇంజనీరింగ్ పూర్తయ్యాక గ్రూపు-1 సాధించాలన్నదే తన లక్ష్యమని తెలిపింది.