14న సత్యగ్రహ దీక్ష
- ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి
- ఓపీఎస్ విధానం కొనసాగించాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఫీజుల బకాయిలు చెల్లించాలని, పాత విధానం కొనసాగించాలని, జీవో నెంబర్ 9 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న వేలాదిమందితో సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ స్కీముల పట్ల ఉన్న అభిప్రాయాలు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సోమ వారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి అఖిల పక్ష, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కాలేజీ కోర్సులు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వ డం లేదని, అలాగే ఈ సంవత్సరం నుంచి చివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యూనివర్సిటీ కాలేజీలు అ యినా నిజాం కాలేజీ, కోటి ఉమెన్స్, బేగం పేట పీజీ కాలేజీ కాలేజీలు కూడా విద్యార్ధుల వద్ద అడ్మిషన్లు సమయంలో పీజులు వసూలు చేస్తున్నారన్నా రు. ఇదంతా చూస్తే ప్రభుత్వం పథకం ప్రకారం ఈ స్కీమును నీరు గార్చి రద్దు చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంజనీరింగ్ కాలేజీ కొన్సిలింగ్ త్వరలో ప్రారంభం కాబోతోందని, దీనిపై ప్ర భుత్వం ఇంకా స్పష్టత ఇవ్వడం లేదన్నారు. వెంటనే 8 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని డి మాండ్ చేశారు. దాదాపు 6 వేల కోట్ల పీజుల బకాయిలు ఉంటే నిన్న ప్రభుత్వం మొక్కుబడిగా 300 కోట్లు విడుదల చేయడానికి ప్రస్తావిస్తూ 8వేల కోట్ల బకాయిలు ఉంటే 300 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్,
బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగొర్ల మోడీ రాందేవ్, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీంరాజు, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రా జేందర్, పృథ్వి గౌడ్, తిరుమలగిరి అశోక్, భాస్కర్ ప్రజాపతి, నిఖిల్‌పటేల్, నరేష్, బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, రాష్ట్ర బీసీ ప్రజాసమితి అధ్యక్షుడు గౌడ్, శివముదిరాజ్ పాల్గొన్నారు.






